: జనవరి 5న వరంగల్ జిల్లాలో కేసీఆర్ పర్యటన


ఐదు రోజుల అయుత చండీయాగం అనంతరం వేములవాడ రాజన్నను దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ వెంటనే ప్రభుత్వ పాలన, పార్టీ విషయాలపై దృష్టి పెట్టారు. జనవరిలో పార్టీ, కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించగా, 5వ తేదీన వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు భూపాలపల్లిలో కేటీపీసీ స్టేజ్-2 విద్యుత్ కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా 600 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని సీఎం జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇందులో టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం, మిషన్ భగీరథ, వరంగల్ నగర అభివృద్ధి, కాకతీయ కాల్వల మరమ్మతులు, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News