: మాజీ ఎంపీ రాజయ్య బెయిల్ పిటిషన్ మరోసారి తిరస్కరణ
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు బెయిల్ విషయంలో మరోసారి నిరాశ ఎదురైంది. తమకు బెయిల్ ఇవ్వాలంటూ రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ పెట్టుకున్న వేర్వేరు దరఖాస్తు పిటిషన్ లను జిల్లా కోర్టు విచారించింది. తరువాత బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. దాంతో ఇప్పటివరకు రాజయ్య దంపతులు మూడుసార్లు, వారి కొడుకు అనిల్ రెండు సార్లు బెయిల్ కోసం అభ్యర్థించగా కోర్టు నిరాకరించింది. కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల ఆత్మహత్య కేసులో వారు ముగ్గురూ నవంబర్ 4 నుంచి వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.