: సల్మాన్ కు ఒక్కసారి నచ్చితే చాలు, జీవితాంతం స్నేహం చేస్తాడు!: శిల్పా శెట్టి
బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని... ఆ తర్వాత పెళ్లి చేసుకుని జీవితంలో హ్యాపీగా సెటిలైపోయింది నాజూకు సుందరి శిల్పా శెట్టి. నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఇప్పుడు మళ్లీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో స్టార్ హీరో సల్మన్ ఖాన్ పై ఆమె పొగడ్తల వర్షం కురిపించింది. సల్మాన్ తనకు చాలా మంచి మిత్రుడని... 'ధడ్కన్' సినిమా తర్వాత ఇతర సినిమాలు లేని సమయంలో, సల్మాన్ ఆయన సినిమాలో తనకు అవకాశం ఇప్పించాడని గుర్తు చేసుకుంది. సల్మాన్ మంచి వాడని తనకు తెలుసని... కానీ, అంత ఫేవర్ చేస్తాడని ఊహించలేకపోయానని చెప్పింది. ఇప్పటికీ ఎక్కడ కనిపించినా, ఎంతో ప్రేమతో మాట్లాడతాడని తెలిపింది. సల్మాన్ కు ఒక్కసారి నచ్చితే చాలు... జీవితాంతం ఎంతో స్నేహంగా ఉంటాడని చెప్పింది. సల్మాన్ కు ఆయన జీవితంపై పూర్తి అవగాహన ఉందని... ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా సరైనవే అని... అతని పెళ్లి గురించి ఆయననే నిర్ణయించుకోనివ్వడం మంచిదని అభిప్రాయపడింది.