: ఢిల్లీలో 'సరి-బేసి' సంఖ్యల విధానంపై మనీశ్ తివారీ అనుమానాలు


కొత్త ఏడాది నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అమలు కాబోతున్న 'సరి-బేసి' సంఖ్యల విధానంపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మనీశ్ తివారీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ వెలుపల నమోదైన వాహనాలను ఎలా నియంత్రిస్తారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ తో దేశ రాజధానిలోకి ప్రవేశించే వాహనాలకు సరి-బేసి విధానాన్ని ఎలా అమలు చేస్తారని అడిగారు. ఉత్తర భారతదేశం, ఢిల్లీ చుట్టుపక్కల నుంచి చాలామంది వాహనాల్లో హస్తినకు వస్తుంటారని, వారందరికీ జరిమానా విధిస్తారా? అని ప్రశ్నించారు. మోటారు వాహనాల చట్టంలోని ఏ సెక్షన్ కింద ప్రతిరోజు చలానా రాస్తారని మనీశ్ నిలదీస్తున్నారు. వాహనాలకు సరి-బేసీ సంఖ్యల విధానం అమలు చేసేముందు బాగా ఆలోచించాలని సూచించారు.

  • Loading...

More Telugu News