: ఫేస్ బుక్ లో 25 లక్షల లైక్ లు పొందిన తొలి బాల నటిగా 'దృశ్యం' అను!
సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లో 25 లక్షల లైక్ లను పొందిన తొలి బాలనటిగా ఎస్తర్ అనిల్ నిలిచింది. పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఎస్తెర్ దక్షిణాదిన బాలనటిగా అందరి మన్ననలూ అందుకుంది. ఎస్తెర్ అనిల్ తొలుత 'నల్లవన్' చిత్రంలో నటించినప్పటికీ, మోహన్ లాల్ కుమార్తెగా 'ఒరు నాల్ వరుమ్' చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2013లో మలయాళంలో విడుదలై ట్రెండ్ సెట్టర్ గా, అతిపెద్ద హిట్ గా నిలిచిన 'దృశ్యం' ఆమె కెరీర్ లో అతిపెద్ద విజయం. ఇక అదే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయగా, హీరో హీరోయిన్లు, ఇతర పాత్రధారులు మారినప్పటికీ, ఎస్తర్ పోషించిన అను పాత్ర ఆమెకే దక్కింది. ప్రస్తుతం ఎస్తర్, పీకే బాబూరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'జెమిని', తమిళ, మలయాళ భాషల్లో హలితా షమీమ్ రూపొందిస్తున్న 'మిన్ మినీ' చిత్రంలో, తమిళంలో 'పూవరసం పీపీ' చిత్రంలోనూ నటిస్తోంది.