: జనవరి 3న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జనవరి 3న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ భేటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరుకానున్నారు. వారితో పాటు పార్లమెంటు సభ్యులకు కూడా సమావేశానికి రావాలని ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్టు సమాచారం. ఇక జనవరి 2న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది.