: లాడెన్ బాడీగార్డ్ చనిపోయాడు!... దీర్ఘకాలిక అనారోగ్యంతో సతమతమైన వైనం


ఐఎస్ ఉగ్రవాదుల తరహాలో ప్రపంచాన్ని గడగడలాడించిన ఆల్ కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అమెరికా మెరుపు సైనికుల దాడిలో కొన్నేళ్ల క్రితం పాకిస్థాన్ లో కన్నుమూశాడు. అతడి వెంట తిరగడమే కాక అతడికి వ్యక్తిగత అంగరక్షకుడిగానూ సుదీర్ఘకాలం పాటు పనిచేసిన నాసర్ అల్ బహ్రీ అలియాస్ అబూ జందాల్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో సతమతమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయాడు. యెమెన్ కు చెందిన ముకల్లాలోని ఓ ఆసుపత్రి వర్గాలను ఊటంకిస్తూ బీబీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. అప్ఘనిస్థాన్ లో ఉన్న సమయంలో లాడెన్ కు అంగరక్షకుడిగానే కాక కారు డ్రైవర్ గానూ జందాల్ పనిచేశాడు. గతంలో అమెరికా మిలిటరీ బలగాలకు చిక్కిన అతడు అమెరికాలోని గ్వాంటెనామో కారాగారంలో కఠిన కారాగారవాసం అనుభవించాడు. 2008లో విడుదలైన జందాల్ తన సొంత దేశం యెమెన్ చేరుకున్నాడు. 1990 దశకంలో బోస్నియా, సోమాలియా, ఆప్ఘన్ లలో ఆల్ కాయిదా మిలిటెంట్లు సాగించిన దాడుల్లో జందాల్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. కారాగారంలో అమెరికా మిలిటరీ చేతిలో శరీరం మొత్తం హూనమైన స్థితిలో విడుదలైన అతడు ఆ తర్వాత దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News