: ప్రమాదంలో ఉన్నారా... అయితే, '9' నొక్కితే చాలు!


ఎవరైనా, ఏదైనా ప్రమాదంలో పడితే తక్షణ సాయం కోసం సమాచారం క్షణాలపై వెళ్లేలా ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మరో టెక్నాలజీ ఆధారిత సేవ మార్చి నుంచి అందుబాటులోకి రానుంది. మీ మొబైల్ లేదా స్మార్ట్ ఫోన్ నుంచి '9' నంబర్ పై లాంగ్ ప్రెస్ చేస్తే చాలు. సమీపంలోని పోలీసు స్టేషన్ కు, పెట్రోలింగ్ పోలీసులకు, బంధు మిత్రులకు సమాచారం వెళ్లిపోతుంది. ఆపై మీ ఫోన్ ట్రాకింగ్ మొదలై మీరెక్కడున్నారన్న సమాచారం పోలీసులకు అందుతుంది. ఆపై సాధ్యమైనంత త్వరలో మీకు సహాయం అందుతుంది. గత కొంత కాలంగా ఈ సదుపాయం కల్పించేందుకు ఐటీ శాఖ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. దీంతో వచ్చే మార్చి నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుంది. వాస్తవానికి ఈ ఆలోచన మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ మనసులో నుంచి వచ్చింది. దీనికి ప్రధాని సైతం సానుకూలంగా స్పందించడంతో, పలువురు ఐటీ నిపుణులు రంగంలోకి దిగి '9' ఫెసిలిటీని సాకారం చేశారు. కాగా, ఇకపై మార్కెట్లోకి వచ్చే హ్యాండ్ సెట్లలో వాల్యూమ్ బటన్లను కలిపి ప్రెస్ చేసినా, అది ఓ ట్రిగ్గర్ గా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సౌకర్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే టెలికం కంపెనీలు సైతం తమ సాంకేతికతను కొంత అప్ గ్రేడ్ చేసుకోవాల్సి వుండటంతోనే '9' సౌకర్యం కొంత ఆలస్యమవుతోందని సమాచారం.

  • Loading...

More Telugu News