: విశాఖలో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు... కీలక నిందితుడు సహా ఐదుగురి అరెస్ట్


నవ్యాంధ్ర వాణిజ్య రాజధానిగా రూపాంతరం చెందుతున్న విశాఖలో హైటెక్ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టేశారు. ఆన్ లైన్ లో ‘విశాఖ కాల్ గర్ల్స్’ పేరిట ప్రత్యేకంగా ఓ సైట్ ను తెరచిన ప్రధాన నిందితుడు హైదరాబాదులో ఉంటూ ఈ ముఠాను నడిపిస్తున్నాడు. తమ సైట్లోకి వచ్చే విటులకు ఆన్ లైన్ లోనే అన్ని వివరాలు అందజేయడంతో పాటు లావాదేవీలను కూడా ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ చీకటి దందాపై పక్కా సమాచారం అందుకున్న విశాఖలోని ద్వారకా పోలీసులు పక్కాగా ప్లాన్ వేసి హైదరాబాదులో ఉంటున్న ప్రధాన నిందితుడితో పాటు, ఈ రాకెట్ కు చెందిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News