: విశాఖ టీడీపీలో ముసలం... కొణతాల చేరికపై స్థానిక నేతల నిరసన గళం


కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగి, ఆ తర్వాత వైసీపీలో ఇమడలేక టీడీపీ గూటికి చేరుతున్న మాజీ మంత్రి, విశాఖ జిల్లా సీనియర్ రాజకీయ నేత కొణతాల రామకృష్ణ ఆ జిల్లాలో పెద్ద చర్చకే తెర తీశారు. మొన్నటిదాకా రాజకీయ ప్రత్యర్థిగా కొనసాగిన కొణతాలను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ టీడీపీ స్థానిక నేతలు నిరసన గళం విప్పుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నంలలో ఆ పార్టీ నేతలు రెండు రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కొణతాల చేరికను ఎలాగైనా అడ్డుకుని తీరాల్సిందేనని ఈ భేటీల్లో నేతలు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తమకు అనుకూలమైన నేతల ద్వారా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెవిన పడేలా చేస్తున్నారు. ఇటీవల వైసీపీకి చెందిన మరో కీలక నేత గండి బాబ్జీతో కలిసి కొణతాల హైదరాబాదులో చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వారిద్దరినీ వెంటబెట్టుకుని మరీ వెళ్లారు. సొంత పార్టీ నేతే కొణతాలను వెంటబెట్టుకుని వెళ్లిన వైనంపైనా స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.

  • Loading...

More Telugu News