: టాలీవుడ్ లో మరో విషాదం... హాస్య నటుడు పొట్టి రాంబాబు మృతి
పలు చిత్రాల్లో కమేడియన్ గా నటించి మెప్పించిన పొట్టి రాంబాబు ఈరోజు ఉదయం మరణించాడు. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టి, ఆపై స్ట్రోక్ రావడంతోనే మృతి చెందినట్టు తెలిసింది. పొట్టి రాంబాబు 40కి పైగా చిత్రాల్లో నటించాడు. ఈశ్వర్, క్లాస్ రూమ్, చంటిగాడు, ప్రేమతో నువ్వు వస్తావని వంటి సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేశాడు. ఇటీవల 'పులిరాజా ఐపీఎస్' పేరిట పొట్టి రాంబాబు హీరోగా ఓ చిత్రం కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, 2015 టాలీవుడ్ కు అత్యంత విషాదాన్ని మిగిల్చిన సంవత్సరంగా మారింది. మరో రెండు రోజుల్లో ఏడాది ముగియనుండగా కూడా మరో నటుడు దూరమై తెలుగు సినీ కళామతల్లికి మరింత శోకాన్ని కలిగించాడు.