: చంద్రబాబు ఇంట సత్య నాదెళ్లకు టిఫిన్ లో ‘లోకల్’ మెనూ... కేరళ అప్పం కూడానట!


మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్ల నిన్న ఉదయం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిలో అల్పాహారం తీసుకున్నారు. ఏపీ సర్కారుతో పలు కీలక ఒప్పందాలు చేసుకునేందుకు హైదరాబాదు వచ్చిన సత్య నాదెళ్ల నిన్న ఉదయమే చంద్రబాబు ఇంటిలో వాలిపోయారు. తన ఇంటికి వచ్చిన ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం అధిపతికి చంద్రబాబు ‘లోకల్’ ఫ్లేవర్ తో కూడిన మెనూను వడ్డించారు. ఇడ్లీ, దోసె, వడలతో కూడిన లోకల్ రుచులతో పాటు కేరళలో ప్రసిద్ధి చెందిన టిఫిన్ ‘అప్పం’ను కూడా వడ్డించారట. అప్పం గురించి సత్య నాదెళ్లకు వివరించిన చంద్రబాబు ఆయనతో కొసరి కొసరి మరీ తినిపించారట.

  • Loading...

More Telugu News