: అఫ్రిదీతో ముంబై మోడల్ అర్షిఖాన్...దుబాయిలో రహస్యంగా కలిశారంటున్న అరబ్ పత్రికలు
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీతో తాను ఏకాంతంగా గడిపానని గతంలో సంచలన ప్రకటన చేసిన ముంబై మోడల్ అర్షిఖాన్, గత నెలలో మరోమారు అతడిని కలిసిందట. దుబాయిలో వీరిద్దరూ అత్యంత రహస్యంగా కలుసుకున్నారట. ఈ కలయికపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పత్రికలు పలు కథనాలు రాశాయి. అయితే ఈ కలయిక ఎక్కడ జరిగిందన్న విషయాన్ని మాత్రం ఆ కథనాలు స్పష్టంగా పేర్కొనలేదు. అయితే, ఈ కథనాలను అఫ్రిదీ కొట్టిపారేశాడు. గత నెల 27న ఇంగ్లండ్, పాక్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు అర్షిఖాన్ హాజరైనట్లు తెలుస్తోంది. మ్యాచ్ సందర్భంగా తనను చాలా మంది అభిమానులు కలిశారని పేర్కొన్న అఫ్రిదీ, వారిలో అర్షి కూడా ఉండొచ్చేమోనని వ్యాఖ్యానించాడు. అయితే ఆమెతో తాను ఏకాంతంగా కలిశానంటూ వచ్చిన వార్తలు మాత్రం అవాస్తవమని పేర్కొన్నాడు. ఇక ఈ విషయంపై మాట్లాడేందుకు అర్షిఖాన్ నిరాకరించింది.