: పాతబస్తీలో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్... పలువురు అనుమానితుల అరెస్ట్


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జంట నగరాల్లో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏడాదిన్నర క్రితం మొదలైన కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు పలు ప్రాంతాల్లో కొనసాగాయి. ఈ తరహా దాడుల్లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో నిందితులు పట్టుబడగా, చోరీకి గురైన వాహనాల్లో మెజారిటీ వాహనాలు దొరికిపోయాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత వందలాది మంది పోలీసులు హఫీజ్ బాబా నగర్, బహద్దూర్ పురా, కాలాపత్తార్ లలో కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు చేశారు. ఇంటింటికీ తిరిగి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, సరైన పత్రాలు లేని వాహనాలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News