: మావోయిస్టు కీలక నేత గణేశ్ మృతి


ఛత్తీస్ గడ్-ఏపీ సరిహద్దులలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత నగేశ్ మృతి చెందాడు. అతను చనిపోయినట్టు ఎస్పీ రవి ప్రకాశ్ ధ్రువీకరించారు. గతంలో ఆయనపై 30 కేసులున్నాయి. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం మల్లంపేట వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు ఇంకా ఘటనాస్థలంలో ఉండి ఎన్ కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. మల్లంపేట, ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్ కౌంటర్ తూర్పు మన్యంలో జరగడంతో మన్యం ప్రాంతాన్ని మొత్తం పోలీసులు జల్లెడ పడుతున్నారు.

  • Loading...

More Telugu News