: ఉన్నతాదాయ వర్గాలకు గ్యాస్ రాయితీ నిలిపివేసేందుకు కేంద్రం చర్యలు


దేశంలోని ఉన్నతాదాయ వర్గాల వారికి గ్యాస్ రాయితీ నిలిపివేసేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో వార్షిక ఆదాయం రూ.10 లక్షలు, అంతకుమించిన వారికి గ్యాస్ రాయితీ నిలిపివేయాలని నిర్ణయించింది. నిజమైన లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పేదలందరికీ గ్యాస్ అందించాలన్న లక్ష్యంతో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'గివ్ ఇట్ అప్' పేరుతో పిలుపునిచ్చారు. ఇందుకు అనేకమంది స్పందించి గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు. ఇంకా అనేకమంది స్పందించాల్సి ఉంది. అయితే తనకు తానుగానే కేంద్రం ఉన్నతాదాయ వర్గాలకు గ్యాస్ రాయితీని ఇవ్వకూడదని ఇప్పుడు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News