: 'కాంగ్రెస్ దర్శన్' కంటెంట్ ఎడిటర్ కు 'ఊస్టింగ్' ఆర్డర్స్


కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక 'కాంగ్రెస్ దర్శన్'కు కంటెంట్ ఎడిటర్ గా ఉండి, పెను వివాదం సృష్టించేలా జవహర్ లాల్ నెహ్రూ, సోనియా గాంధీలపై విమర్శనాత్మక వ్యాసం రచించి, ప్రచురించిన సుధీర్ జోషిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచనలను అమలు చేసి ఉంటే, ఇప్పుడు కాశ్మీర్ సమస్య ఉండేది కాదని ఈ వ్యాసంలో ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. నెహ్రూకు, పటేల్ కు మధ్య అభిప్రాయాలు కుదిరేవి కాదని, అప్పట్లో పటేల్ ఆలోచనలకు అనుగుణంగా నెహ్రూ కదిలుంటే, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో సమస్యలు వచ్చుండేవి కాదని కూడా ఈ వ్యాసంలో రచయిత అభిప్రాయపడ్డారు. కాగా, ఈ వ్యాసంలోని అభిప్రాయాలు పార్టీకి ఇబ్బందికరమేనని కాంగ్రెస్ దర్శన్ ఎడిటర్ సంజయ్ నిరుపమ్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాసం ప్రచురితం కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News