: తాపేశ్వరం లడ్డూకు ఐదోసారి గిన్నిస్ రికార్డు
తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ వారి లడ్డూ మరోసారి గిన్నిస్ రికార్డుకెక్కింది. ఈ ఏడాది వినాయకచవితి సందర్భంగా విశాఖలో వినాయకుడి కోసం 8,369 కేజీల లడ్డూ తయారుచేసి ఈ రికార్డు సాధించింది. ఈ మేరకు గిన్నీస్ సంస్థ వారికి సర్టిఫికేట్ అందజేసింది. దాంతో 2011 నుంచి వరుసగా తాపేశ్వరం లడ్డూ ఐదోసారి గిన్నిస్ రికార్డు కొట్టింది. ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా భక్తాంజనేయ స్వీట్స్ యాజమాన్యం వారు భారీ లడ్డూ తయారు చేస్తున్న విషయం తెలిసిందే.