: అందుకోసమే స్పీకర్ పై అవిశ్వాసం: వైకాపా
అసెంబ్లీలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ, విపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు వైఖరికి నిరసనగానే వైకాపా తరఫున అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చామని ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఆయనలో మార్పును కోరుతూ మాత్రమే నోటీసులు ఇచ్చామని తెలిపారు. నోటీసులు ఇవ్వడం ద్వారా స్పీకర్ వ్యవహార శైలిపై సభలో చర్చకు అవకాశం ఉంటుందని, మా వాదన ప్రజలకు తెలుస్తుందని అన్నారు. అసెంబ్లీ కార్యకలాపాలను కోడెల తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు తాకట్టు పెట్టారని జ్యోతుల నిప్పులు చెరిగారు. అవిశ్వాసం తరువాతైనా ఆయన శైలిలో మార్పు రావాలని కోరుకుంటున్నామని అన్నారు.