: ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను ప్రజలే నేరుగా ఎన్నుకుంటే మంచిది!: జేసీ దివాకర్ రెడ్డి


వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మరోమారు వార్తల్లోకి ఎక్కారు. దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేల అవసరం లేదంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రిని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం ఉంటే మంచిదని జేసీ అభిప్రాయపడ్డారు. కాగా, ఏపీకు ప్రత్యేక హోదా, టీడీపీ వ్యవహారం, సీఎం చంద్రబాబు గురించి జేసీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చట్టసభల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయో!

  • Loading...

More Telugu News