: వేములవాడలో రుద్రాభిషేకం నిర్వహిస్తున్న కేసీఆర్ దంపతులు
కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులు రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. అంతకుముందు రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కాగా, కేసీఆర్ తలపెట్టిన అయుత చండీ మహా యాగం నిన్న ముగిసింది. యాగం ముగిసిన రోజు రాత్రి అక్కడి యాగశాలలోనే కేసీఆర్ కుటుంబసభ్యులు నిద్ర చేశారు. ఈరోజు వేములవాడ రాజన్న దర్శనానికి కేసీఆర్ కుటుంబసమేతంగా విచ్చేశారు.