: ఏపీఎస్సార్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు నూతన సంవత్సర కానుక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ యాజమాన్యం కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. వారికి డబుల్ డ్యూటీ మొత్తాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. డబుల్ డ్యూటీ చేసే డ్రైవర్లకు రూ.250 నుంచి రూ.350కు, కండక్టర్లకు రూ.200 నుంచి రూ.300కు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.