: కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులను కాపాడే పనిలో చంద్రబాబు: మావోయిస్టులు


కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులను ఏపీ ప్రభుత్వం రక్షిస్తోందని మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సోమవారం బహిరంగ లేఖ రాశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులను ప్రభుత్వం శిక్షించని పక్షంలో వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు హెచ్చరించారు. వడ్డీల పేరుతో అమాయక మహిళలను వేధించి వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపింది టీడీపీ నేతలే నన్నారు. ఈ దందాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను రక్షించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని ఆ లేఖలో ఆరోపించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని మరుగు పరచడమే లక్ష్యంగా బాబు సర్కార్ పనిచేస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే అంగన్ వాడీ మహిళలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ బాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో నిందితులను శిక్షించే వరకు ప్రజలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు పోరాడాలని మావోయిస్టులు ఆ లేఖలో పిలపునిచ్చారు.

  • Loading...

More Telugu News