: మంగళూరులో కాలు మోపకుండా ప్రవీణ్ తొగాడియాపై కర్ణాటక నిషేధం


కర్ణాటకలోని మంగళూరులో మత ఘర్షణలు చెలరేగిన వేళ, అక్కడికి వెళ్లేందుకు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియాను అనుమతించేది లేదని కన్నడ సర్కారు స్పష్టం చేసింది. ఆయనతో పాటు ఇస్లామిక్ స్కాలర్ డాక్టర్ జకీర్ నాయక్ ను సైతం రానివ్వబోమని వెల్లడించింది. ఈ మేరకు కర్ణాటక పోలీసు శాఖ వీరిద్దరిపైనా నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. జనవరి 3న సౌత్ కర్నాటక సలాఫీ మూవ్ మెంట్ (ఎస్కేఎస్ఎం) మూడు రోజుల సెమినార్ ను ఏర్పాటు చేయగా, దానిలో ముఖ్య అతిథిగా జకీర్ పాల్గొనాల్సి వుంది. ఇక తొగాడియా ఓ హిందూ సంస్థ నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొని ఆవు మాంసం, లవ్ జీహాద్, హిందువులపై దాడులు తదితర అంశాలపై జరిగే చర్చలో పాల్గొనాల్సి వుంది. ఇటీవల మంగళూరులో మత ఘర్షణలు జరిగిన సందర్భంగానే, వీరిరువురూ వస్తే పరిస్థతి దిగజారుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సీఆర్పీసీ లోని సెఫన్ 144 ఆధారంగా వారిపై నిషేధాన్ని విధించినట్టు వెల్లడించింది.

  • Loading...

More Telugu News