: కేసీఆర్ యాగం వద్ద జంప్ జిలానీలదే హడావుడి: రావుల


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అయుత మహా చండీయాగం వద్ద ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన నేతలే ఎక్కువ హడావుడి చేశారని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఫిరాయింపుల యాగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా... పోలింగ్ సమయంలో కూడా తమ వారిని ఎత్తుకు పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువు కూడా సరిగా రాని ఎంపీటీసీలు ఫైవ్ స్టార్ హోటళ్లలో కూర్చొని ఏం చేస్తారో ఎన్నికల ప్రధాన అధికారికి తెలియదా? అని ప్రశ్నించారు. యాగం మూడ్ నుంచి బయటకు వచ్చి, పాలనపై దృష్టి సారించాలని కేసీఆర్ కు ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News