: దానం నాగేందర్ ను తరిమికొట్టిన మల్లేశ్ గౌడ్!... ఉప్పల్ లో ఇరువర్గాల ఘర్షణ


కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ కు పరిస్థితులు అంతగా కలిసి రావడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం కూడా ఓ వెలుగు వెలిగిన దానం, ఆ తర్వాత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించిన వేడుకల్లో భాగంగా ఉప్పల్ లో దానంకు గట్టి షాక్ తగిలింది. పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, దానం వర్గీయుల మధ్య పెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా ఉప్పల్ లో మల్లేశ్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన దానం నాగేందర్, మల్లేశ్ జెండాను కిందకు దించి ఆ తర్వాత మరోమారు జెండాను ఎగురవేశారు. దీంతో మల్లేశ్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లేశ్ గౌడ్, దానం నాగేందర్ పై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత దానం వర్గంపై కోడిగుడ్లతో దాడి చేశారు. దానం నాగేందర్ ను లక్ష్యంగా చేసుకునే వారు కోడిగుడ్లు విసిరారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మల్లేశ్ గౌడ్ వర్గం ఊహించని దాడితో కంగుతిన్న దానం తన అనుచరవర్గంతో కలిసి అక్కడి నుంచి పరుగులు పెట్టారు.

  • Loading...

More Telugu News