: హెల్మెట్ ధరించకుంటే... దాని ధర కంటే ఎక్కువ జరిమానా విధించండి: హైకోర్టు ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో హెల్మెట్ల వాడకంపై హైకోర్టు ఈరోజు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు జరిగిన విచారణలో, హెల్మెట్ల వాడకాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించింది. అసలు హెల్మెట్ ధరించే నిబంధనను ఎందుకు కఠినంగా అమలు చేయడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి స్పందించిన తెలంగాణ ఏజీ, చైన్ స్నాచింగ్ ల నేపథ్యంలో అమలు చేయలేకపోతున్నామని తెలిపారు. ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన కోర్టు, హెల్మెట్ ధరించకుంటే జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధర కంటే అధికంగా జరిమానా విధించాలని స్పష్టం చేసింది.