: మోదీ లాహోర్ పర్యటనపై శివసేన అటాక్!...పాక్ వెళ్లిన నేతల కెరీర్ గల్లంతేనని కామెంట్


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాహోర్ పర్యటనపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, మిత్రపక్షం శివసేన కూడా స్వరం పెంచింది. రష్యా, అఫ్ఘనిస్థాన్ పర్యటనను ముగించుకుని కాబూల్ లో తిరుగు పయనానికి కొన్ని గంటల ముందు ఖరారైన ఈ పర్యటనలో పాకిస్థాన్ నగరం లాహోర్ ల్యాండైన మోదీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత దగ్గరుండి మరీ మోదీని నవాజ్ లాహోర్ శివారు ప్రాంతం రాయ్ విండ్ లోని తన ఇంటికి తీసుకెళ్లారు. దాదాపు రెండు గంటలకు పైగా నవాజ్ ఇంటిలో గడిపిన మోదీ ఆ తర్వాత తిరిగి వచ్చేశారు. ఈ పర్యటనపై శివసేన సొంత పత్రిక ‘సామ్నా’ తన సంపాదకీయంలో ఆసక్తికర కామెంట్లు చేసింది. పాక్ లో పర్యటించిన రాజకీయ నేతలందరి కెరీర్ ఆ తర్వాత అత్యంత వేగంగా ముగిసిందని పేర్కొంది. ఇందుకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీలను ఉదహరించింది.

  • Loading...

More Telugu News