: ఆంధ్ర దోశపై జపాన్ గవర్నర్ అమితాసక్తి!


జపాన్ లోని తయోమో రాష్ట్ర గవర్నర్ తక కసుయిషీ ఆంధ్ర దోశపై ఆసక్తి కనబరిచారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇవాళ జపాన్ ప్రతినిధుల బృందం విజయవాడకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలోని గేట్ వే హోటల్ లో వారికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అందులో ఇడ్లి, దోశ, గారె, ఉప్మాలను జపాన్ బృందానికి ఆప్యాయంగా వడ్డించారు. గవర్నర్ తక కసుయిషీకి దోశ రుచి నచ్చింది. లొట్టలేసుకుంటూ తిన్నారు. అంతటితో ఆగకుండా దోశ వేసిన విధానాన్ని స్వయంగా అక్కడి వారిని ఆయన అడిగి మరీ తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News