: అమెజాన్, షాప్ క్లూస్ పోర్టల్స్ లో పిడకల అమ్మకం... ఢిల్లీ వాసికి లాభాల పంట!


ఇంటర్నెట్ సౌకర్యం విశ్వవ్యాప్తమయ్యాక ఎన్నో వెబ్ సైట్లు, ఆన్ లైన్ పోర్టల్స్ వచ్చేశాయి. బయటికెళ్లి కొనుగోలు చేయక్కర్లేకుండానే ప్రతి వస్తువు ఆన్ లైన్ లో లభిస్తోంది. ఈ కోవలోకి కొత్తగా ఆవుపేడతో చేసిన పిడకలు కూడా వచ్చి చేరాయి. ప్రస్తుతం అమెజాన్, షాప్ క్లూస్ వంటి పలు పోర్టల్స్ లో పిడకలు లభిస్తున్నాయి. రూ.99 నుంచి రూ.400 పైగా ధరకు ఆవుపేడ పిడకలు అమెజాన్ లో అమ్మకానికి వున్నాయి. ఇప్పుడీ వ్యాపారం ఢిల్లీకి చెందిన మతపరమైన సామగ్రిని అమ్ముతున్న ఆసియా క్రాప్ట్స్ యాజమాని ప్రీతి కర్లాకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ప్రీతి.. పూజాదికాల్లో ప్రస్తుతం ఏం వాడుతున్నారో తెలుసుకోవడానికి ఆమె భక్తి చానళ్లను చూస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆవుపేడ విశేషాన్ని తెలుసుకుంది. దాంతో ఢిల్లీ శివార్లలోని గ్రామాల నుంచి ఆవుపేడతో చేసిన పిడకలను సేకరించి ఆన్ లైన్ లో అమ్ముతోంది. ప్రస్తుతం సొంతంగా ఓ ఊరిలో పిడకల తయారీని చేపట్టింది. ఇలా 8 పిడకల ప్యాక్ ను ఆసియా క్రాప్ట్స్ రూ.419కి అమ్ముతోంది. నెలకు రూ.3వేల పైచిలుకు ప్యాకెట్ల ఆవుపేడ పిడకలను ఈ సంస్థ అమ్ముతోంది. విదేశాల్లోని హిందూ ఆలయాల నుంచి కూడా వారికి ఆర్డర్లు వస్తుండటంతో వ్యాపారం మరింత విస్తరిస్తోంది.

  • Loading...

More Telugu News