: యూపీలో దారుణం... ఎన్నికల్లో తల్లి గెలిచిందని కుమార్తెపై పగ తీర్చుకున్న ప్రత్యర్థులు


ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. మీర్జాపూర్ జిల్లాలో ఇటీవల జరిగిన బీడీసీ (బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్) ఎన్నికల్లో ఓ మహిళ విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రత్యర్థులు ఆమె కుమార్తెను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి ఒడిగట్టారు. జరిగిన అవమానాన్ని భరించలేక ఇంటర్ చదువుతున్న ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గత వారంలో ఎన్నికల ఫలితాలు రాగా, మీర్జాపూర్ ప్రాంతానికి బీడీసీ సభ్యురాలిగా ఓ మహిళ ఎన్నికైంది. అప్పటి నుంచి ఆగ్రహంగా వున్న ప్రత్యర్థులు ఆమె ఇంట్లో చొరబడి, నిద్రిస్తున్న కుమార్తెను కిడ్నాప్ చేసి సరిహద్దుల్లోని పొలానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. ఆపై ఇంటికి వచ్చిన బాలిక, జరిగిన విషయాన్ని తల్లికి చెప్పి, నిందితులు పప్పూ బాహేలియా, బిందూ బహేలియాలని వెల్లడించింది. బాలికను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు కేసు పెట్టేందుకు వెళ్లారు. పోలీసులు తొలుత కేసు పెట్టేందుకు వెనుకాడారు. న్యాయం చేస్తామని చెప్పి ఇంటికి పంపించారు. ఆ మరుసటి రోజే బాలిక తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో దిగివచ్చిన పోలీసులు నిందితులపై కేసు పెట్టారు. నిందితులు గెలిచిన మహిళా అభ్యర్థికి బంధువులేనని, కేసును విచారిస్తున్నామని మిర్జాపూర్ ఎస్పీ వివరించారు.

  • Loading...

More Telugu News