: ఏపీఎస్ఆర్టీసీకి 500 తెలంగాణ బస్సులు!
ఈ సంక్రాంతి సీజనులో రద్దీకి తగ్గట్టుగా బస్సు సర్వీసులను నడిపేందుకు అవసరమైతే ఏపీఎస్ఆర్టీసీకి 500 వరకూ బస్సులను అందించేందుకు సిద్ధమని టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది. జనవరి 1 నుంచి 20 వరకూ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి తెలంగాణ, ఏపీల్లోని అన్ని జిల్లా కేంద్రాలకూ మొత్తం 2,715 బస్సులను నడుపుతామని వెల్లడించిన తెలంగాణ ఆర్టీసీ, రద్దీ ఎక్కువైతే మరిన్ని సర్వీసులు నడుపుతామని స్పష్టం చేసింది. స్పెషల్ బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కేవలం ప్రత్యేక బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలను వసూలు చేయనున్నట్టు వివరించారు. స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ చేరుకునేందుకు కావాల్సిన బస్సులను ఏపీ సర్కారు కోరితే ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు.