: టీవీ నటిపై మైనర్ బాలుడి వేధింపుల పర్వం... వాట్సప్ లో అశ్లీల పొటోలు పంపిన వైనం


దేశంలో మైనర్ బాలుర అకృత్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి. నిర్భయ ఘటనలో బాల నేరస్థుడు పాల్పడిన అకృత్యం తరహాలోనే ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో మైనర్ బాలురు దారుణాలకు పాల్పడుతున్నారు. ముంబైలో వెలుగుచూసిన ఈ తరహా ఘటనలో ఓ మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళితే...ఇప్పుడిప్పుడే బుల్లి తెరపై స్థానం పదిలపరచుకుంటున్న ఓ చిన్న నటిపై ముంబైలోని దహిసర్ ప్రాంతానికి చెందిన ఓ పదహారేళ్ల బాలుడు వేధింపులకు పాల్పడ్డాడు. సదరు నటికి సంబంధించిన అశ్లీల ఫొటోలను చేజిక్కించుకున్న ఆ మైనర్, వాటిని ఆమె వాట్సప్ కు పంపి షాకిచ్చాడు. ఆ నటికి చెందిన ఈ-మెయిల్, ఇతర సోషల్ మీడియా సైట్ల నుంచే ఆ మైనర్ సదరు అశ్లీల ఫొటోలను దొరకబుచ్చుకున్నాడట. వాట్సప్ లో పంపిన ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కకుండా ఉండాలంటే తనకు రూ.5 లక్షలు ముట్టజెప్పాలని ఆమెను బెదిరించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన సదరు నటి, బంగౌర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నేటి ఉదయం ఆ మైనర్ బాలుడిని పట్టేశారు. విచారణలో భాగంగా ఆ నటిపై సాగించిన తీరులోనే మరో ముగ్గురు, నలుగురు నటీమణులను కూడా ఆ మైనర్ వేధించాడట. అయితే ఏ ఒక్కరి నుంచి కూడా అతడు డబ్బు వసూలు చేయకముందే పోలీసులకు పట్టుబడిపోయాడు.

  • Loading...

More Telugu News