: క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ దాదాపు అడుక్కుంటోంది: కేజ్రీవాల్
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విషయంలో తనను క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ దాదాపు అడుక్కుంటోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోను తాను క్షమాపణలు చెప్పనని స్పష్టం చేశారు. జైట్లీ వేసిన పరువునష్టం కేసులో విచారణ జరగాలని... అప్పుడు నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. డీడీసీఏ విచారణ నిమిత్తం ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని... అవినీతి కార్యకలాపాలు జరిగినట్టు పేర్కొందని... అయితే, ఎవరి పేర్లను ప్రస్తావించలేదని తెలిపారు. ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్ ఈ విధంగా స్పందించారు.