: భారత్ మరో సిరియా కాకుండా ఉండాలంటే... రామ మందిరం నిర్మించాల్సిందేనంటున్న తొగాడియా


అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం అవకాశం చిక్కిన ప్రతిసారి గళమెత్తున్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా మరోమారు తన స్వరం పెంచారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జరుగుతున్న వీహెచ్ పీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా నేటి ఉదయం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) భారత్ లోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత్ మరో సిరియాగా మారకుండా ఉండాలంటే రామ మందిరం నిర్మాణాన్ని చేపట్టాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. రామ మందిరం నిర్మాణంతో భారత్ లో ఐఎస్ విస్తరణకు అడ్డుకట్ట పడినట్టేనని కూడా తొగాడియా చెప్పారు. ఒక్క ఉగ్రవాద విస్తరణకు అడ్డుకట్ట పడటమే కాక రామ మందిరం నిర్మాణంతో దేశ ఆర్థికాభివృద్ధి కూడా సాధ్యపడుతుందని ఆయన సూత్రీకరించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం పార్లమెంటులో ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో హిందువులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, అసలు హిందువుల మాట వినే నాథుడే కరవయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News