: దక్షిణాది రాష్ట్రాల యువతపై ఎక్కువగా ఐఎస్ ప్రభావం: ఎన్ఐఏ డైరెక్టర్


ఇస్లామిక్ ఉగ్రవాదుల భావజాల వ్యాప్తి భారత్ కు ప్రధాన ముప్పుగా పరిణమిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ శరద్ కుమార్ అన్నారు. ఐఎస్ ప్రభావం ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల యువతపై ఎక్కువగా ఉందని లక్నోలో ఎన్ఐఏ కొత్త భవనం శంకుస్థాపన సందర్భంగా చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఉగ్రవాద భావజాలం చాలా తక్కువ ఉందన్నారు. అయితే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం భారత్ లో ఇంకా వేళ్లూనుకోలేదని స్పష్టం చేశారు. కానీ ఇంటర్నెట్ ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారని శరద్ వివరించారు. దానికి అడ్డుకట్టు వేసేలా కేంద్రం ఉగ్రవాద వ్యతిరేక ప్రచారాన్ని తీసుకురానున్నట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో నకిలీ కరెన్సీ దేశానికి పెద్ద సమస్యగా మారిందన్న ఎన్ఐఏ డైరెక్టర్, సుమారు 25 వేల కోట్ల రూపాయల నకిలీ కరెన్సీ చెలామణిలో ఉందని వెల్లడించారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ లోని మల్దా నకిలీ కరెన్సీ హబ్ గా మారిందని చెప్పారు.

  • Loading...

More Telugu News