: గుజరాత్ సింహాలు మనుషుల్ని తినేస్తున్నాయి!


సాధారణంగా పులులు మ్యాన్ ఈటర్ లుగా మారి మనుషులను చంపేస్తుంటాయి. కానీ, సింహాలు అలా చేయడం ఎప్పుడూ వినలేదు. ఒకవేళ దాడి చేసినా, అవి మనిషి మాంసం ముట్టవు. కానీ గుజరాత్ లో పరిస్థితి మారింది. గిర్ అడవుల్లో సింహాల సంఖ్య గణనీయంగా పెరగడంతో సింహాలు అడవులు దాటి బయటకు వచ్చి, మానవులపై దాడులు చేస్తున్నాయి. సోమనాథ్ జిల్లాలోని మలియా హతినా సమీపంలో ఏడేళ్ల రోహిత్ పై దాడి చేసిన ఓ మగ సింహం అతడిని అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ సింహం అదే అలవాటును కొనసాగిస్తుందన్న భయంతో అటవీ శాఖ అధికారులు దాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెంటనే జునాగఢ్ జిల్లా భేసన్ సమీపంలో 45 ఏళ్ల మహిళపై మరో సింహం దాడి చేయగా, ఆమె కూడా మరణించింది. సింహాలు మనుషులపై దాడులు చేయడం చాలా అరుదని అధికారులు చెబుతున్నారు. గిర్ అడవుల్లో సింహాల సంఖ్య గడచిన ఐదేళ్లలో 411 నుంచి 523కు పెరగడం, వాటికి సరైన ఆహారం లభించకపోవడంతో అవి గ్రామాల్లోకి వస్తున్నాయని వివరించారు.

  • Loading...

More Telugu News