: రాకాసి అలలు వస్తున్నాయ్... చెన్నైకి హెచ్చరికలు, సునామీ టీమ్ లు సిద్ధం!


ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చెన్నై నగరం ముందు మరో పెను సమస్య నిలిచింది. తమిళనాట సముద్ర మట్టం పెరగనుందని, 8 నుంచి 10 అడుగుల ఎత్తయిన రాకాసి అలలు విరుచుకుపడవచ్చని నేషనల్ మేరీటైం ఇన్ఫర్మేషన్ సెంటర్ హెచ్చరికలు జారీచేసింది. దీని ఫలితంగా పెను నష్టం సంభవించవచ్చని, కన్యాకుమారి జిల్లాలోని కులాచ్చాల్ నుంచి రామనాథపురం జిల్లాలోని కీలక్కరాయ్ వరకూ నష్టపోవచ్చని పేర్కొంది. సోమవారం రాత్రి వరకూ అలల తాకిడి ఉంటుందని, 55 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. కన్యాకుమారి తీరంలోని వివేకానంద, తిరువళ్లువర్ విగ్రహాల సందర్శనకు ప్రజలను అనుమతించడం లేదు. ఎక్కడికక్కడ సునామీ టీమ్ లను సిద్ధం చేసిన తమిళ సర్కారు, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొంటామని చెబుతోంది.

  • Loading...

More Telugu News