: నాటి సచిన్ ఆలోచన... నేడు అమల్లోకి!


దాదాపు రెండు సంవత్సరాల క్రితం మాస్టర్ బ్లాస్టర్ మదిలో మెదిలిన ఆలోచన నేడు కార్యరూపంలోకి రానుంది. అప్పట్లో క్రికెట్ జట్టులో 13 మందిని ఉంచాలని, మైదానంలో 11 మందే ఉన్నా, మిగతా ఇద్దరినీ అవసరాన్ని బట్టి బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయించేందుకు అనుమతించాలని ప్రతిపాదించగా, దాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆచరణలోకి తెచ్చింది. అండర్-14 క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న ముంబై క్రికెట్ అసోసియేషన్ 13 మంది ఫార్మాట్ ను తొలిసారి వాడుతోంది. ఇలా చేస్తే, మరింత మందికి అవకాశాలు దక్కుతాయన్నది సచిన్ అభిమతం. ఈ ఫార్మాట్ విజయవంతమైతే, ఆపై దేశీయ క్రికెట్ లోనూ ఇదే విధానం అమలవుతుందేమో!

  • Loading...

More Telugu News