: రుత్విక్కులకు కేసీఆర్ ఘన సన్మానం... స్వర్ణ కంకణాలు తొడిగిన వైనం


తాను చేపట్టిన అయుత మహా చండీయాగాన్ని నిర్విఘ్నంగా జరిపించిన రుత్విక్కులను గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఘనంగా సన్మానించారు. నిన్న సాయంత్రం చండీయాగం పూర్ణాహుతి ముగిసిన తర్వాత జరిగిన కార్యక్రమం సందర్భంగా ప్రజల సుఖ శాంతులను కాంక్షిస్తూ యాగం చేశారని కేసీఆర్ ను ఆకాశానికెత్తేసిన ప్రముఖ సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ, కేసీఆర్ కు బంగారు కంకణాన్ని అందజేశారు. అదే సమయంలో యాగాన్ని నిర్విఘ్నంగా నిర్వహించిన రుత్విక్కులను కేసీఆర్ ఘనంగా సన్మానించారు. యాగం క్రతువులకు ప్రధాన పూజారిగా వ్యవహరించిన పురాణం మహేశ్వర శర్మ తదితరులకు కేసీఆర్ స్వర్ణ కంకణాలు తొడిగారు. ఇక యాగం విజయవంతంగా ముగిసేందుకు కృషి చేసిన పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా కేసీఆర్ ఘనంగా సన్మానించారు.

  • Loading...

More Telugu News