: జూనియర్ ఎన్టీఆర్ కు తండ్రి అంటే విపరీతమైన ప్రేమ: దర్శకుడు వీవీ నాయక్
నాన్నకు ప్రేమతో చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ కు తన తండ్రి అంటే విపరీతమైన ప్రేమ. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు తండ్రి అంటే మహా ప్రేమ.. ఈ విధంగా ఈ చిత్రంలోని చాలా మందకి తమ తండ్రులంటే చెప్పలేనంత ప్రేమ ఉందని, కనుక ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆయన అన్నారు.