: తెలంగాణ వస్తే ఈ యాగం చేస్తానని మొక్కుకున్నాను: కేసీఆర్


'తెలంగాణ వస్తే అయుత చండీయాగం చేస్తానని నాడు మొక్కుకున్నాను' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శృంగేరిలో జరిగిన యాగం స్ఫూర్తితోనే ఈ అయుత చండీ మహాయాగం నిర్వహించానని చెప్పారు. అయుత చండీయాగం సుసంపన్నమైందని, మహా పూర్ణాహుతితో యాగం పరిపూర్ణమైందని అన్నారు. త్వరలోనే శృంగేరి పీఠాధిపతిని కలుస్తానని, ఆయన ఆశీస్సులు తీసుకుంటానని తెలిపారు. తెలంగాణ ప్రజలు సంతోషంతో బతికే రోజులే తనకు సంతోషాన్ని ఇస్తాయని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ విజయవంతం కావాలని, ప్రాజెక్టులు పూర్తయి రాష్ట్రంలో కరవు పోవాలని అమ్మ వారిని వేడుకున్నానని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News