: ఇవాళ రాత్రికి యాగశాలలోనే నిద్రించనున్న కేసీఆర్ కుటుంబసభ్యులు!


ఇవాళ రాత్రికి యాగశాలలోనే కేసీఆర్ కుటుంబసభ్యులు నిద్రించనున్నారు. మర్నాడు ఉదయం సోమవారం నాడు కరీంనగర్ జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రాన్ని కేసీఆర్ కుటుంబసభ్యులు దర్శించనున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అయుత చండీ మహాయాగం ఈరోజుతో ముగిసింది. మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ మహా క్రతువు పూర్తయింది. మెదక్ జిల్లా ఎర్రవల్లిలో అయుత చండీ మహాయాగంను ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించారు. ఈ యాగంలో 2 వేల మంది రుత్విక్కులు పాల్గొన్నారు. ఈ మహాయాగంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ దంపతులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మీడియా అధినేతలు, రాజకీయ నేతలు, టీ మంత్రులు, పలువురు పీఠాధిపతులు, ప్రత్యేక ఆహ్వానితులతో పాటు భారీగా సామాన్య జనం కూడా తరలివచ్చారు.

  • Loading...

More Telugu News