: మీడియాకు చెప్పే పెళ్లి చేసుకుంటాను: సల్మాన్ ఖాన్
తన పెళ్లి గురించి ఎన్నో వదంతులు వస్తున్నాయని.. వాటి గురించి చదివి కడుపుబ్బ నవ్వుకుంటానని బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ అన్నాడు. ఈ రోజు తన 50వ బర్త్ డే సందర్భంగా సల్మాన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు. తాను పెళ్లి చేసుకోబోవడం లేదని, చేసుకునేటప్పుడు మీడియాకు తప్పకుండా చెబుతానని సల్మాన్ అన్నాడు. తన సోదరి వివాహం జరిగినప్పుడే తాను రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు వదంతులు వచ్చాయని గుర్తుచేశాడు. తన సినిమాల గురించి కూడా సల్లూ భాయి మాట్లాడాడు. తాను ఏదైనా సినిమా చేసేటప్పుడు ముఖ్యంగా తాను ఆలోచించేది అభిమానుల గురించి అని చెప్పాడు. వినోదంతో పాటు మరెన్నో విషయాలను అభిమానులు కోరుకుంటారని.. వారిని నిరాశపరచకుండా తన చిత్రాలు ఉండేలా చూసుకుంటానని కండల వీరుడు సల్మాన్ పేర్కొన్నాడు.