: తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్!
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. నాలుగు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. 95 శాతం పైగా పోలింగ్ నమోదైంది. కాగా, ఈ నెల 30న ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనుంది. కాగా, మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే ఆరు స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.