: మోదీ నుంచి దేశాన్ని కాపాడాలి: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి
ప్రధాని నరేంద్ర మోదీ నుంచి దేశాన్ని.. తృణమాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పశ్చిమబెంగాల్ను కాపాడాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈ రెండు ప్రభుత్వాలను సాగనంపాలని అన్నారు. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు మతతత్వ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు. పశ్చిమ బెంగాల్ లో ‘తృణమాల్’ కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోయాయని ఆరోపించారు. దేశంలో ‘అసహనం’ పెరిగిపోతోందంటూ పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు ఆందోళన చేసిన విషయాన్ని సీతారాం ఏచూరి ఈ సందర్భంగా ప్రస్తావించారు.