: పొగమానేస్తే సమస్యా...? ఇ`విటమిన్‌ ఉంటే చాలు!!


దీర్ఘకాలం పాటు ఉన్న అలవాటును ఒక్కసారిగా మానేస్తే.. దేహ ప్రక్రియలో కొన్ని అవాంఛనీయ మార్పు చేర్పులు చోటుచేసుకోవడం చాలా సహజం. పొగతాగే అలవాటున్న వారు .. హఠాత్తుగా మానేస్తే రక్తనాళాల పనితీరులో కొంత స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో గుండెజబ్బులకు దారితీయగల అవకాశం కూడా ఉంటుంది.

ఇలాంటి ఆరోగ్యపరంగా సంభవించే విపరిణామాలను ఎదుర్కోవడంలో విటమిన్‌`ఇ చాలా మేలు చేస్తుందిట. గామాటొకొఫెరాల్‌ రూపంలో విటమిన్‌`ఇ ను నిర్దిష్ట మోతాదులో ఇవ్వడం వల్ల.. స్మోకింగ్‌ మానేసిన వారిలోనూ మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయిట. అమెరికా పరిశోధకులు ఈ నవీన విషయాన్ని ధూమప్రియులకు శుభవార్తలాగా కనిపెట్టారు.

  • Loading...

More Telugu News