: బర్రెలను కొనుగోలు చేసినట్లుగా అభ్యర్థులను కొనుక్కున్నారు: టీడీపీ అభ్యర్థి
బర్రెలను కొనుగోలు చేసినట్లుగా అభ్యర్థులను కొన్నారని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, లగ్జరీ జీవితానికి, ఫైవ్ స్టార్ హోటళ్లకు అలవాటుపడిన నేతలు గ్రామ ప్రజలకు ఎలాంటి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి అభ్యర్థులను ప్రజలు నిలదీయాలని అన్నారు. అసమర్థులైన అభ్యర్థులతో పోటీ పడినందుకు తాను చాలా సిగ్గుపడుతున్నానని దయాకర్ రెడ్డి అన్నారు. కాగా, తెలంగాణాలో ఈరోజు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పాలకపక్షం, ఇతర రాజకీయ పార్టీలకు మధ్య పోరు రసవత్తరంగా ఉన్న విషయం తెలిసిందే.