: శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూకంపం!
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో స్వల్ప భూకంపం సంభవించింది. పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, మూడు రోజుల క్రితం ఇదే మండలంలోని రోలుగ, కనిమెట్ల గ్రామాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. సుమారు నాలుగు సెకన్ల పాటు భూమి కంపించిన విషయం తెలిసిందే.