: రుత్వికుల పరుగులు... మంటలెలా అంటుకున్నాయంటే..!


ప్రజల శాంతి సౌభాగ్యాలను కోరుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అయుత మహా చండీయాగాన్ని నిర్వహిస్తున్న వేళ తుది రోజున సంపూర్ణ పూర్ణాహుతికి ముందు యాగశాల పైకప్పు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. యాగం విరామ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది. మరో గంటలో దేశ ప్రథమ పౌరుడు యాగానికి రానుండగా ఈ ఘటన జరగడం కలకలం రేపింది. యాగ క్రతువులో భాగంగా ఉదయం నుంచి, కిలోల కొద్దీ కర్పూరం, ఆవునెయ్యిని 101 భారీ హోమగుండాల్లో వేసిన రుత్వికులు, విరామం కోసం లేచిన వేళ, యాగ మండపంలోని ఓ హోమ గుండంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా లేచిన మంట పైకప్పుదాకా పాకి అంటుకుంది. పైకప్పును వరిగడ్డితో నిర్మించడంతో ఒక్క నిమిషంలోనే మంటలు పాకాయి. పైనుండి మంటలంటుకున్న గడ్డి కిందపడుతుండటంతో, వందలాది మంది రుత్వికులు బయటకు పరుగులు తీశారు. వివిధ హోమగుండాల చుట్టూ ఉంచిన పూజా ద్రవ్యాలు కాలిపోయాయి. పలువురు రుత్వికులకు గాయాలు కాగా, వారిని ఆసుపత్రులకు తరలించారు.

  • Loading...

More Telugu News